చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 2.ఓ సక్సెస్ ఊపులో ఉన్నారు. శంకర్ దర్శకత్వలో సైంటిఫిక్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లలో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. 2.ఓ విడుదల నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీటూ సహా పలు అంశాలపై రజనీకాంత్ తన మనోగతం వెల్లడించారు.
మీటూ ఉద్యమం మహిళలకు ఒక మెరుగైన అవకాశంగా ముందుకొచ్చిందని, అయితే వారు దీన్ని దుర్వినియోగం చేయడం లేదా అవకాశంగా తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. మీటూపై సహనటులను అప్రమత్తం చేస్తారా అని ప్రశ్నించగా, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను నడిగర్ సంఘం చేపడుతుందని చెప్పారు. ఈ అంశాలను పరిష్కరించేందుకు నడిగర్ సంఘం ఓ వేదికను ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.
పనిప్రదేశంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభవాలను మీటూ పేరిట వెల్లడిస్తూ సినీ, వ్యాపార, మీడియా సహా పలు రంగాలకు చెందిన మహిళలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment