
ఇండియన్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘2.ఓ’ . ఈ చిత్ర ట్రైలర్‌ను చెన్నైలోని సత్యం థియేటర్‌లో శనివారం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఇరవై నాలుగు గంటలకే సోషల్ మీడియాలో రికార్డులు నమోదు చేసింది.
మూడు (తమిళ, తెలుగు, హిందీ) భాషల్లో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఒకే రోజులో ఈ ట్రైలర్‌ను తమిళ్‌లో 8మిలియన్లు, హిందీలో 10.6 మిలియన్లు, తెలుగులో 3.6 మిలియన్ల మంది వీక్షించారు. మొత్తంగా 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment