ఏడాదికి ముందే రెడీ! | Amy Jackson to Have a Beach Side Greek Wedding | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 3 2019 10:45 AM | Last Updated on Sun, Feb 3 2019 10:48 AM

Amy Jackson to Have a Beach Side Greek Wedding - Sakshi

తారల పెళ్లి అంటే ఆ హంగామా, ఆ సందడే వేరప్పా. కొందరు రెండు రోజులు, మరికొందరు వారం రోజులు అంటూ వివాహ వేడుకలను జరుపుకుంటుంటారు. అయితే ఈ హడావుడి నెల ముందు నుంచి మొదలవ్వవచ్చు. లేదా రెండు నెలల ముందు నుంచి ప్రారంభం కావచ్చు. అయితే నటి ఎమీజాక్సన్‌ రూటే వేరు కదా! ఏకంగా ఏడాదికి ముందు నుంచే పెళ్లి ప్రయత్నాలను చేసుకుంటోంది.

మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ఇంగ్లిష్‌ బ్యూటీ ఆ తరువాత ఐ, తెరి, 2.ఓ వరకూ బాగానే అవకాశాలను రాబట్టుకుంది. అదేవిధంగా బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్‌ చుట్టేసింది. రజనీకాంత్‌తో నటించిన 2.ఓ చిత్రం తనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని ఆశలు పెట్టుకుంది. అయితే అలా జరగలేదు. అందుకు కారణాలేమైనా, ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. ఒక హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో మాత్రం నటిస్తోంది.

ఆ మధ్య బాలీవుడ్‌ యువ నటుడితో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనే ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత యూకేకు చెందిన బిగ్‌షాట్‌ జార్జ్‌ పనయిటోవా అనే వ్యకిని ప్రేమించి, ఆయనతో షికార్లు కొడుతూ వస్తోంది. ఈ విషయం ఇటీవలే బయటకొచ్చింది. ఇటీవల ఆ ప్రేమజంట ఆఫ్రికాకు విహారయాత్ర చేశారు. అప్పుడు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట.

పనిలో పనిగా మంచి తరుణం మించిపోనీకూ అన్న చందాన ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తరువాత వివాహ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ సంచలన జంట 2020లో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే అందుకు ఎమీ ప్రియుడు ఇప్పటి నుంచే ఆ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ ముద్దుగుమ్మ ప్రియుడ్ని ఒక కోరిక కోరిందట.

మన పెళ్లి ఇంతకు ముందు ఎవరూ చేసుకోని విధంగా చాలా స్పెషల్‌గా ఉండాలని, అందుకు ఒక అందమైన సముద్రతీరం వేదిక కావాలని కోరిందట. అంతే ఎమీ ప్రియుడు అలాంటి ప్రాంతం కోసం గాలించి చివరికి గ్రీస్‌ దేశంలోని ఒక దీవిని సెలక్ట్‌ చేశాడట. ఆ దీవిలోని ఒక రిసార్ట్‌ వివాహ వేదికను ఏడాదికి ముందే ఏర్పాటు చేసుకోనున్నారట ఈ జంట. నటి ఎమీ కాబోయే భర్త అత్యంత కోటీశ్వరుడట. ఎమీయా మజాకా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement