![Bharateeyudu Squel Going On The Sets Soon - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/26/Shankar%20Kamal%20Haasan.jpg.webp?itok=ot4R9tNH)
లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళ్‌లో రూపొందిచన ఈసినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వల్‌ను రూపొందించేందుకు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌ను ప్రయత్నిస్తున్నారు. అయితే ఇద్దరు బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
శంకర్ 2.ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే భారతీయుడు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు శంకర్, కమల్‌లు ఒకే వేధిక నుంచి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ లోగా కమల్ రాజకీయాల్లో బిజీ కావటం, శంకర్ తెరకెక్కిస్తున్న 2.ఓ వాయిదా పడటంతో భారతీయుడు 2 పట్టాలెక్కలేదు. తాజాగా కమల్ తన సినీ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా సినిమాల్లో కొనసాగుతానని చెప్పటం, శంకర్ కూడా 2.ఓ రిలీజ్ డేట్ ప్రకటించటంతో త్వరలోనే భారతీయుడు 2 పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
ముందుగా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించేందుకు సిద్దమయ్యారు. అయితే ప్రాజెక్ట్ డిలే కావటం, బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోవటంతో దిల్ రాజు తప్పుకున్నారు. దీంతో 2.ఓ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో భారతీయుడు 2ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment