ఓటీటీ రిలీజ్‌కు ఇండియన్‌ 3? | Indian 3 To Skip Theatrical, Team Planning For OTT Release, Check Reports Inside | Sakshi
Sakshi News home page

Indian 3 OTT Release: ఓటీటీ రిలీజ్‌కు ఇండియన్‌ 3?

Oct 4 2024 3:57 AM | Updated on Oct 4 2024 3:42 PM

Indian 3 for OTT release

‘ఇండియన్‌ 3’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ కానుందా? అంటే అవుననే సమాధానాలే కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరవైఎనిమిదేళ్ల  తర్వాత ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్‌ 2, ఇండియన్‌ 3’ సినిమాలను తెరకెక్కించారు దర్శకుడు శంకర్‌. రెండు సీక్వెల్స్‌లోనూ కమల్‌హాసన్‌ హీరోగా నటించారు. ‘ఇండియన్‌ 2’ విడుదలైన ఆరు నెలల తర్వాత ‘ఇండియన్‌ 3’ సినిమాను రిలీజ్‌ చేయాలనుకున్నారు. 

ఈ ఏడాది జూలై 12న ‘ఇండియన్‌ 2’ థియేటర్స్‌లో విడుదలైంది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదు. దీంతో ‘ఇండియన్‌ 3’ విడుదల మరింత ఆలస్యం అవుతుందని, వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్‌ ఉన్నాయని కోలీవుడ్‌లో టాక్‌ వినిపించింది. అయితే ‘ఇండియన్‌ 2’ సక్సెస్‌ కాని నేపథ్యంలో ‘ఇండియన్‌ 3’ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందా? అని చిత్రయూనిట్‌ ఆలోచిస్తోందనే టాక్‌ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చి0ది. 

మరి... తమిళ పరిశ్రమలో ప్రచారంలో ఉన్నట్లుగా ‘ఇండియన్‌ 3’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతుందా? అనేది చూడాలి. ఇక ‘ఇండియన్‌ 3’ సినిమాను లైకాప్రొడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకాలపై సుభాస్కరన్‌ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... నయనతార, సిద్ధార్‌్థ, మాధవన్, మీరా జాస్మిన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘ది టెస్ట్‌’. శశికాంత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement