కమల్‌ హాసన్‌ చివరి సినిమా అదేనా? | Is Indian 2 Kamal Haasan Last Movie | Sakshi
Sakshi News home page

Aug 7 2018 4:06 PM | Updated on Aug 7 2018 4:22 PM

Is Indian 2 Kamal Haasan Last Movie - Sakshi

‘శభాష్‌ నాయుడు’ సినిమా సంగతి ఇంకా తెలియాల్సి ఉంది

లోక నాయకుడు, యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ హీరోగా ‘విశ్వరూపం 2’ రాబోతోంది. ప్రస్తుతం సినిమాలతో, రాజకీయాలతో బిజీగా ఉన్న కమల్‌ హాసన్‌ త్వరలోనే సినిమాలకు స్వస్తి పలకనున్నారు. తమిళనాడులో ‘మక్కళ్‌ నీది మయ్యం’ పార్టీని బలోపేతం చేసేందుకు కమల్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ పార్టీని ప్రజల్లోకి మరింత చేరువ చేసేందుకు ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారు. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోందన్న ప్రచారం అప్పట్లో ఊపందుకుంది. ఇక కమల్‌ కూడా ‘భారతీయుడు 2’ సినిమానే తన చివరి సినిమానే అని చెప్పినట్లు సమాచారం. విశ్వరూపం 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక భారతీయుడు 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటికే సగం షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకున్న ‘శభాష్‌ నాయుడు’ సినిమా సంగతి ఇంకా తెలియాల్సి ఉంది. కమల్‌ నటించి దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ ఆగస్టు 10న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement