‘ఇండియన్‌-2’ మొదలైంది..! | Shankar And Kamal hassan Indian 2 Movie pooja ceremony | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 12 2018 12:44 PM | Last Updated on Mon, Nov 12 2018 12:47 PM

Shankar And Kamal hassan Indian 2 Movie pooja ceremony - Sakshi

ఇండియన్‌ డైరెక్టర్‌ శంకర్‌, యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కలిస్తే క్రియేట్‌ అయ్యే సెన్సేషన్‌కు తరుణం ఆసన్నమైంది. గతంలో ఇండియన్‌(భారతీయుడు)తో సంచలనం సృష్టించిన వీరి కాంబినేషన్‌.. మళ్లీ ఇన్నాళ్లకు సీక్వెల్‌ రూపంలో ప్రకంపనలు సృష్టించేందకు రెడీ అయింది. 

ఇప్పటికే శంకర్‌ ‘2.ఓ’కు సంబంధించిన పనులను పూర్తి చేశారు. ఈ చిత్రం విడుదలైన తరువాత ‘ఇండియన్‌2’ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ‘ఇండియన్‌2’కు సంబంధించిన పూజాకార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ​ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలను త్వరలోనే చిత్రయూనిట్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement