హైదరాబాద్‌లో ఇండియన్‌–2 షూటింగ్‌ | Indian 2 Shhoting In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇండియన్‌–2 షూటింగ్‌

Published Sat, Mar 17 2018 9:56 AM | Last Updated on Sat, Mar 17 2018 9:56 AM

Indian 2 Shhoting In Hyderabad - Sakshi

భారతీయుడు సినిమా షూటింగ్ స్పాట్లో శంకర్ కమల్

తమిళసినిమా: తమిళసినిమాను భారతదేశ ఎల్లలు దాటించిన దర్శకులలో శంకర్‌ ఒకరు. ఈయన చిత్రాలే కాదు ఆలోచనలు, ఆచరణలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ముందుంటారు. ముదల్‌వన్‌ చిత్రం నుంచే శంకర్‌ టెక్నాలజీని ఉపయోగించడంలో సిద్ధహస్తుడనిపించుకున్నారు. అలా బాయ్స్, ఇండియన్, శివాజీ, ఎందిరన్‌ చిత్రాల్లో శంకర్‌ సాంకేతిక పరిజ్ఞానం అబ్బురపరచింది. తాజాగా 2.ఓ చిత్రాన్ని హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమనే తిరిగి చూసేలా తీర్చిదిద్దడానికి అహర్నిశలు తపిస్తున్నారు. 2.ఓ చిత్రీకరణను పూర్తి చేసుకుని గ్రాఫిక్స్‌ వర్క్‌ జరుపుకుంటోంది. దీంతో శంకర్‌ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కమలహాసన్‌ కథానాయకుడిగా ఇండియన్‌–2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర కథను శంకర్‌ థాయ్‌లాండ్‌లో తయారుచేశారట. కథ చర్చలు అంతా అక్కడే జరిగాయని సమాచారం. ఇక చిత్ర షూటింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్‌లను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది. కమలహాసన్‌ రాజకీయరంగ ప్రవేశం చేసిన తరుణంలో ఇండియన్‌–2 చిత్రం ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని సమాచారం. ఇండియన్‌ చిత్రం తరహాలోనే ఇది కూడా అవినీతిపై పోరాటంగానే ఉంటుందట. రాజకీయ నాయకులు ప్రజల డబ్బును ఎలా దోచుకుంటున్నారో చేప్పే చిత్రంగా ఇండియన్‌–2 ఉంటుందని సినీవర్గాల టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement