Kamal Hassan and Shankar's Indian Movie: Going to Resume Its Shooting Soon - Sakshi
Sakshi News home page

Indian 2: మళ్లీ సెట్స్‌ పైకి వెళ్లనున్న కమల్‌హాసన్‌ ‘భారతీయుడు 2’?

Published Sat, Oct 30 2021 2:27 PM | Last Updated on Sat, Oct 30 2021 4:19 PM

Kamal Hassan and Shankars Indian Movie Going to Resume Its Shooting Soon - Sakshi

కమల్‌హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం ‘ఇండియన్‌’. ఇదే తెలుగులో ‘భారతీయుడు’గా డబ్బింగ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 1996లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ తెరకెక్కుతుండగా.. అందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చాలా భాగం షూటింగ్‌ పూర్తైన తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌, శంకర్‌ మధ్య వివాదం తలెత్తడంతో మూవీ ఆగిపోయింది.

అయితే తాజాగా ఆ సినిమా మళ్లీ సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు, డైరెక్టర్‌కి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తైన ఈ మూవీని మిగిలిన పార్ట్‌ని వీలైనంత త్వరగా కంప్లీట్‌ చేసి విడుదల చేయాలని వారు భావిస్తున్నారంట. అయితే శంకర్‌ ఇప్పటికే రామ్‌చరణ్‌ హీరో ‘ఆర్‌సీ15’, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ హీరో ‘అపరిచితుడు’ రీమేక్‌ చేయనున్నట్లు అనౌన్స్‌ చేశాడు. దీంతో వాటికంటే ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాడా.. లేదా? అనేది చూడాలి.

చదవండి: సింహం ఎప్పుడు సింహమే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement