సంక్రాంతికి ఇండియన్‌–2 | Kamal Haasan Indian 2 Shoot To Start After June | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఇండియన్‌–2

Published Sat, May 18 2019 8:25 AM | Last Updated on Sat, May 18 2019 8:25 AM

Kamal Haasan Indian 2 Shoot To Start After June - Sakshi

చెన్నై : ఇండియన్‌ చిత్రం నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్‌ల సినీ కెరీర్‌లో ఒక మైలురాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి చిత్రానికి సీక్వెల్‌ చేయడం ఒక సాహసమే అవుతుంది. అందుకు కమలహాసన్, శంకర్‌ సిద్ధమైనా, మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్నట్లు ప్రకటన వెలువడింది. కారణాలేమైనా ఆయన ఇండియన్‌–2 చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ చిత్ర నిర్మాణం చేపట్టింది. నటి కాజల్‌అగర్వాల్‌ను కథానాయకిగా ఎంపిక చేశారు. అయితే అంతకు ముందు నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. ఆమె బిజీగా ఉండడంతో అంగీకరించలేదనే ప్రచారం జరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్‌–2 చిత్రాన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు షూటింగ్‌ చేసిన తరువాత కమలహాసన్‌ రాజకీయాల్లో బిజీ అవడంతో ఇండియన్‌ 2 చిత్రీకరణ నిలిచిపోయింది. అయితే చిత్రం ఆగిపోయిందనే ప్రచారం జోరందుకుంది. అందుకు కారణం నిర్మాణ సంస్థ లైకా సంస్థ చేతులెత్తేసిందనే ప్రచారం సాగుతోంది. దీంతో దర్శకుడు శంకర్‌ మరో రెండు భారీ సంస్థలతో ఇండియన్‌–2 చిత్ర నిర్మాణం గురించి చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగింది. తాజాగా లైకా సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. అంతే కాదు చిత్ర షూటింగ్‌ జూన్‌లో మొదలు కానుందని సమాచారం. చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంత్రికి తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక పూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో ప్రస్తుతం బిగ్‌బాస్‌ 3 కార్యక్రమాల్లో పాల్గొంటున్న కమలహాసన్‌ ఇండియన్‌–2 చిత్ర షూటింగ్‌కు రెడీ అవుతునట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement