Lyka productions
-
నయనతార షాకింగ్ నిర్ణయం.. ఇకపై ఆ స్టార్ హీరోతో..!
పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనా నానుమ్ రౌడీదాన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార భర్త విగ్నేశ్ శివన్. తాజాగా నటుడు అజిత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించాల్సి ఉంది. అయితే ఈ సమయంలో శివన్‌కు ఊహించని రీతిలో షాకిచ్చారు స్టార్ హీరో అజిత్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ. అందుకు కారణం విగ్నేశ్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్‌కు, లైకా సంస్థకు నచ్చకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే అజిత్ నటించిన తునివు ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. కథలో కొన్ని మార్పులు చేయాలని చెప్పినా అందుకు విగ్నేశ్ శివన్ నిరాకరించినట్లు టాక్. దీంతో నటి నయనతార రంగంలోకి దిగినా ఫలితం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో నయనతార కఠిన నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. నయనతార ఇకపై అజిత్ సరసన సినిమాల్లో నటించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది . తన భర్త విగ్నేశ్ శివన్‌కు చిత్రానికి అజిత్, లైకా ప్రొడక్షన్స్ తిరస్కరించటమే కారణంగా భావిస్తున్నారు. కాగా.. నయన్, అజిత్ నటించిన బిల్లా, ఆరంభం, విశ్వాసం సినిమాలు మంచి విజయాల్ని సాధించాయి. ఇకపై నయన్, అజిత్ తెరపై కనిపించరన్న వార్త అభిమానులకు మింగుడు పడడం లేదు. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరికొన్ని రోజులు ఆగితే స్పష్టత వచ్చే అవకాశముంది. -
పాపులర్ కమెడియన్‌పై బయోపిక్.. అతనెవరంటే ?
Kapil Sharma Biopic Funkaar Will Soon Directed By Mrighdeep Singh: సినీ చిత్రసీమలో అనేక మంది ప్రముఖులపై అనేక బయోపిక్‌లు వస్తున్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు, క్రికెట్ దిగ్గజాలు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ వంటివారిపైనై ఈ బయోపిక్‌లు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఒక కమెడియన్‌పై ఎలాంటి బయోపిక్ తీయలేదు. దీన్ని బ్రేక్ చేస్తూ ప్రముఖ కమెడియన్‌పై తాజాగా బయోపిక్ చిత్రం రానుంది. అతనెవరంటే మోస్ట్ పాపులర్ హిందీ కామెడీ టాక్ షో అయిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ' హోస్ట్ కపిల్ శర్మ. అవును కపిల్ శర్మపై బయోపిక్ త్వరలో రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తన ట్విటర్ ద్వారా తెలిపాడు. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఈయన గతంలో ఫుక్రే సినిమాను డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సమర్పించనుంది. 'కపిల్ శర్మ కోట్లాది మంది ప్రజలకు ప్రతిరోజు నవ్వులను పంచుతాడు. అలాంటి కపిల్ శర్మ గురించి మీకు తెలియని జీవిత కథను వెండితెరపై చూపెట్టబోతున్నాం' అని మహావీర్ జైన్ తెలిపారు. BIOPIC ON KAPIL SHARMA: 'FUKREY' DIRECTOR TO DIRECT... A biopic on #KapilSharma has been announced... Titled #Funkaar... #MrighdeepSinghLamba - director of #Fukrey franchise - will direct... Produced by #MahaveerJain [#LycaProductions]... #Subaskaran presents. #KapilSharmaBiopic pic.twitter.com/7LxhfKt4r6 — taran adarsh (@taran_adarsh) January 14, 2022 ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
సంక్రాంతికి ఇండియన్–2
చెన్నై : ఇండియన్ చిత్రం నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్ల సినీ కెరీర్లో ఒక మైలురాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి చిత్రానికి సీక్వెల్ చేయడం ఒక సాహసమే అవుతుంది. అందుకు కమలహాసన్, శంకర్ సిద్ధమైనా, మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్నట్లు ప్రకటన వెలువడింది. కారణాలేమైనా ఆయన ఇండియన్–2 చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత లైకా ప్రొడక్షన్స్ సంస్థ చిత్ర నిర్మాణం చేపట్టింది. నటి కాజల్‌అగర్వాల్‌ను కథానాయకిగా ఎంపిక చేశారు. అయితే అంతకు ముందు నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. ఆమె బిజీగా ఉండడంతో అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్–2 చిత్రాన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తరువాత కమలహాసన్ రాజకీయాల్లో బిజీ అవడంతో ఇండియన్ 2 చిత్రీకరణ నిలిచిపోయింది. అయితే చిత్రం ఆగిపోయిందనే ప్రచారం జోరందుకుంది. అందుకు కారణం నిర్మాణ సంస్థ లైకా సంస్థ చేతులెత్తేసిందనే ప్రచారం సాగుతోంది. దీంతో దర్శకుడు శంకర్ మరో రెండు భారీ సంస్థలతో ఇండియన్–2 చిత్ర నిర్మాణం గురించి చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగింది. తాజాగా లైకా సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. అంతే కాదు చిత్ర షూటింగ్ జూన్‌లో మొదలు కానుందని సమాచారం. చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంత్రికి తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక పూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో ప్రస్తుతం బిగ్‌బాస్ 3 కార్యక్రమాల్లో పాల్గొంటున్న కమలహాసన్ ఇండియన్–2 చిత్ర షూటింగ్‌కు రెడీ అవుతునట్టు సమాచారం. -
చిరంజీవి 150వ సినిమాకు అడ్డంకులు?
-
చిరంజీవి 150వ సినిమాకు కొత్త అడ్డంకులు?
మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు కొత్త అడ్డంకులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా రీ ఎంట్రీ సినిమాపై కసరత్తులు చేస్తున్న చిరంజీవి, ఇటీవలే తమిళ సూపర్ హిట్ సినిమా 'కత్తి'ని రీమేక్ చేయాలని నిర్ణయించారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మెగా తనయుడు రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇంకా పట్టాలెక్కని ఈ సినిమా నిర్మాణంపై కథా హక్కుల వేదిక ఆంక్షలు విధించింది. కత్తి కథ తనదేనంటూ రచయిత ఎన్ నరసింహారావు పోరాడుతుండటంతో ఆయనకు న్యాయం చేసిన తరువాతే సినిమా నిర్మాణం చేపట్టాలని కథా హక్కుల వేదిక చైర్మన్ దాసరి నారాయణరావు తీర్మానించారు. అప్పటివరకు దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేయడానికి నిర్ణయించారు. మురుగదాస్ స్వయంగా రాసుకొని తెరకెక్కించిన కత్తి కథను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మెగా క్యాంప్ చెపుతోంది. ఈ సినిమాను తమిళ్లో నిర్మించిన లైకా ప్రొడక్షన్స్, తెలుగులోనూ నిర్మిస్తుండటంతో హాక్కుల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. మరి ఇలాంటి సమయంలో కథా హక్కుల వేదిక ఆంక్షలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.