ఆర్‌ఎక్స్-100తో కుర్రకారు మనసు దోచుకున్న నటి పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సాధించిన ఈ నటికి ఊహించిన విధంగా ఆఫర్లు రావడం లేదు. వెంకీ మామ, డిస్కో రాజా వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కెరీర్ పరంగా ఆమెకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. అయితే ఈ అమ్మడికి ఊహించని అవకాశం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాయల్‌కు నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ కథానాయకుడిగా ‘ఇండియన్ 2’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. (చదువులో నేను టాపర్: సమంత)
ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ప్రత్యేక గీతం కోసం పాయల్‌ను చిత్ర బృందం సంప్రదించిందని టాక్. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్‌కు అవకాశం వస్తే పెద్ద బ్రేక్ దొరికినట్లేనని, శంకర్ సినిమాలో కనిపిస్తే అటు నార్త్ ఇటు సౌత్‌లో ఫుల్ క్రేజ్ పెరుగుతుందని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (తండ్రి అయిన దర్శకుడు)
భారతీయుడు-2లో పాయల్‌కు అవకాశం?
Published Sat, May 30 2020 3:05 PM | Last Updated on Sat, May 30 2020 3:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment