భారతీయుడు మళ్లీ వస్తాడా..! | Shankar, Kamal Haasan Bharateeyudu Sequal | Sakshi
Sakshi News home page

భారతీయుడు మళ్లీ వస్తాడా..!

Published Fri, Sep 15 2017 12:14 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

భారతీయుడు మళ్లీ వస్తాడా..!

భారతీయుడు మళ్లీ వస్తాడా..!

కమల్ హాసన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా భారతీయుడు. అవినీతి, లంచగొండితనం మీద తెరకెక్కించిన ఈ సినిమాకు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటినుంచి భారతీయుడు సినిమాకు సీక్వల్ ను రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారు చిత్రయూనిట్. అయితే సరైన కథా కథనాలు దొరక్క ఈ సీక్వల్ ఆలస్యం అవుతూ వచ్చింది.

శంకర్ తో పాటు, కమల్ కూడా తన సినిమాలతో బిజీగా ఉండటంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.ఓ సినిమా రిలీజ్ కు దగ్గరపడుతుండటంతో మరోసారి భారతీయుడు సీక్వల్ తెర మీదకు వచ్చింది. ఇప్పటికే శంకర్ ఓ లైన్ సిద్ధం చేశాడని, కమల్ ఓకె చెపితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే శంకర్, కమల్ ఈ సీక్వల్ పై ఇంత వరకు అఫీషియల్ గా స్పందించలేదు. కానీ అభిమానులు మాత్రం మరోసారి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ను తెర మీద చూసేందుకు ఎదురుచూస్తున్నారు. గతంలో స్టార్ నిర్మాత ఏయం రత్నం భారతీయుడు సీక్వల్ కోసం ప్రయత్నాలు చేశారు. మరి రోబో సీక్వల్ తరువాత అయినా ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement