గ్రేట్ డైరెక్టర్ శంకర్, లోక నాయకుడు కమల్ హాసన్ ల కాంబినేషన్‌లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా భారతీయుడు. సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కనున్నట్టుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి రకరకాల వార్తలు సౌత్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
ముందుగా నిర్మాతగా దిల్ రాజు తప్పుకున్నాడని, తరువాత కమల్ తప్పుకున్నాడనీ వార్తలు వినిపించాయి. ఇటీవల ఈ భారీ చిత్రానికి సంగీత దర్శకునిగా కోలీవుడ్ యువ సంచలనం అనిరుద్‌ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి భారతీయుడు సంగీత దర్శకునిగా ఎవరినీ ఫైనల్ చేయలేదని, ముఖ్యంగా అనిరుద్ ను ఈ విషయంపై సంప్రదించలేదని తెలిపింది. 2.ఓ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఆ సినిమా పూర్తయిన తరువాత భారతీయుడు 2 పనులు ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment