
కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్–2 చిత్రంలో ఆయనకు జంటగా నయనతారను నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అందుకు నయనతార కొన్ని షరతులు విధించారు. అందులో ముద్దుసీన్లు తీయాలనుకుంటే ముందుగానే తెలియజేయాలని, స్విమ్ సూట్‌లో నటించేది లేదంటూ తేల్చేశారు. ఇలావుండగా కోలమావు కోకిల అనే చిత్రంలో మత్తుమందులు తరలించే మహిళగా నటిస్తున్నారు నయనతార. ఈ సినిమా కోసం నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఓ పాట కూడా రాశారు. ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది.
ఇలావుండగా కమలహాసన్ నటించిన విశ్వరూపం–2 చిత్రం ఇదివరకే ఫైనాన్స్ సమస్యతో రెండేళ్లు రిలీజ్ కాకుండా ఉంది. ఈ చిత్రం బాధ్యతలు స్వీకరించిన కమలహాసన్ చిత్రాన్ని పూర్తిగా ముగించి సెన్సార్ సర్టిఫికెట్ పొందారు. ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఇండియన్–2లో జంటగా నటించనున్న కమలహాసన్, నయనతార నటించిన చిత్రాలు ఒకే రోజున తలపడేందుకు రెడీ కావటంతో కోలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment