
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధ్యయన బృందంలో రాజన్
దావోస్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అధ్యయనానికి ఏర్పాటయిన ప్రత్యేక కర్తవ్య నిర్వహణా బృందంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సభ్యునిగా నియమితులయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ బ్యాంకర్లు, విధాన నిర్ణేతలు ఉన్నారు. ఈ మేరకు జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డబ్ల్యూఈఎఫ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పాత్ర, ఆర్థిక రెగ్యులేటరీ సంస్కరణలు వంటి అంశాలపై చర్చిస్తుంది. తమ సమగ్ర అధ్యయన నివేదికను ఈ బృందం 2017 జనవరిలో జరిగే డబ్ల్యూఈఎఫ్ 47వ వార్షిక సదస్సులో సమర్పిస్తుంది.