అంగన్‌వాడీ ఆయా ఆత్మహత్య | Married Women Commits End Lives in Khammam | Sakshi

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

Jul 13 2020 11:30 AM | Updated on Jul 13 2020 11:39 AM

Married Women Commits End Lives in Khammam - Sakshi

ఖమ్మంరూరల్‌: ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండల పరిధిలోని నాయుడుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేటలోని తాళ్ళగడ్డకు చెందిన రేణుక(35)కు, నాయుడుపేటకు చెందిన పోలేబోయిన నాగేశ్వరరావుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. రేణుక అంగన్‌వాడీ ఆయాగా పని చేస్తోంది. భర్త నాగేశ్వరరావు ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

కుమారుడికి కూడా మాటలు సరిగా రావు. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా సరిగాలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ నెల 11న ఎవరూ లేని సమయంలో ఇంట్లోని ఇనుప పైపునకు ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అపస్మారస్థితిలోనే చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు రావుల నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రూరల్‌ ఎస్సై బాణాల రాము తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement