
బీటెక్ ప్రేమకథ
టెన్త్ క్లాస్, ఇంటర్ ప్రేమకథల సీజన్ అయిపోయినట్టుంది. ఇప్పుడు బీటెక్ ప్రేమకథతో ఓ సినిమా రూపొందుతోంది. యల్లారెడ్డి దర్శకత్వంలో ఇందుజ క్రియేషన్స్ పతాకంపై గుడ్‌లైఫ్ మూవీ క్రియేషన్స్ సమర్పణలో వనజ, రేణుక నిర్మిస్తున్న చిత్రం ‘బీటెక్ లవ్‌స్టోరీ’. రమేశ్‌బాబు, శ్రీకాంత్, అంజలి, గెహనా వశిష్ట్ ఇందులో హీరో హీరోయిన్లు. కృష్ణుడు, శ్రావణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఇది. టైటిల్‌తో పాటు కథాంశం కూడా యూత్‌కి కనెక్ట్ అవుతుంది. చిన్నిచరణ్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. హాస్యానికి పెద్ద పీట వేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ బాబు, సహ నిర్మాత: బద్రీనాథ్, పర్యవేక్షణ: శ్యామ్.