జిల్లాకు హైకోర్టు న్యాయమూర్తి రాక | today comeing the high court judge | Sakshi
Sakshi News home page

జిల్లాకు హైకోర్టు న్యాయమూర్తి రాక

Published Thu, Sep 1 2016 9:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

today comeing the high court judge

కమాన్‌చౌరస్తా : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కరీంనగర్‌ జిల్లా ఫోర్ట్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్‌ ఏ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌కు రానున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.రేణుక తెలిపారు. గురువారం జిల్లా కోర్టులో జరిగిన విలేకరుల సమావేశంలో జడ్జి మాట్లాడారు. శనివారం ఉదయం సుల్తానాబాద్‌ కోర్టు ఆవరణలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు కూడా పాల్గొంటారని అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాసధన్‌ భవనంలో ఉదయం 10  నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయమూర్తులకు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి సీవీ రాములు, ప్రొఫెసర్‌ రఘురాం, అదనపు జిల్లా జడ్జి హేమంత్‌కుమార్‌ పాల్గొంటారన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement