నేడు మహిళా దినోత్సవం
అమ్మగా.. ఆలిగా.. ఉద్యోగినిగా.. సమర్థ అధికారిగా ‘ఆమె’ సేవలు అమేయం. ముదిత్ నేర్వరే ముద్దారగన్ నేర్పన్.. అంటూ అన్ని రంగాల్లో రాణించడం అతివలకు నల్లేరుపై నడక . ఒంటి చేత్తో ఏక సమయంలో విభిన్న పనులు చేసే నైపుణ్యం వారి సొంతం. అవసరమైతే ఆటో డ్రైవర్ కాగలదు .. మహిళల హక్కులపై పోరాటమూ చేయగలదు. బహుముఖ ప్రజ్ఞతో భాసిల్లే ఆదిశక్తీ నీకు వందనం.. నువ్వుంటేనే ఈ లోకం నందనం.
యత్ర నార్యంతు పూజతే!
తత్ర దేవతా రమంతే!!
‘ఆమె’ అభివృద్ధిలో కీలకం
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేవు పథకాల అవులు బాధ్యతలను ఓ మహిళా అధికారి సవుర్థంగా నిర్వహిస్తున్నారు. కుప్పం ప్రాంత అభివృద్ధి అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి చక్కా ప్రియూంక అధికారులను పరుగెట్టిస్తూ సకాలంలో పనులను పూర్తి చేరుుస్తూ వుహిళా శక్తిని చాటుతున్నారు. వరంగల్ ఎన్‌ఐటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన ప్రియూంక రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేశారు. అమెరికాలోని న్యూయూర్క్‌లోని గోల్డ్‌మెన్ సాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో ప్రోగ్రాం అనలసిస్టుగా పనిచేశారు. పాలనాపరమైన ఉద్యోగంపై ఆసక్తి, నేరుగా ప్రజా సవుస్యల పరిష్కారంపై వుక్కువతో గ్రూప్-1 పరీక్షలు రాశారు. 2012 బ్యాచ్‌లో ఉత్తర్ణీత సాధించి అవులాపురంలో ఆర్డీగా చేరారు. వుదనపల్లి ఆర్డీవో కర్ణన్‌ను వివాహం చేసుకున్నారు. ప్రియూంక పనితీరు, నిర్ణయూల్లో వేగం, కింది స్థారుు అధికారులతో పని చేరుుంచే నేర్పు పాలకులకు నచ్చటంతో కుప్పంలో పని చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
- శాంతి పురం
డ్రైవింగ్‌లో దిట్ట..
వాహనాల డ్రైవింగ్ లో సాధారణంగా పురుషులే పనిచేస్తుంటారు. ఇందు కు భిన్నంగా ఓ మహిళ డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తోంది. ఆమే సాయి డ్రైవింగ్ స్కూల్ యజమాని రేణుక (చిట్టి). భర్త సుబ్రమణ్యంరెడ్డి సహకారంతో డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తోంది. పదేళ్లుగా వందలాది మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తుంది. డ్రైవింగ్‌తోపాటు సేవా కార్యక్రమాల్లో రాణిస్తోంది. కళ్లకు గంతలు కట్టుకుని రెండు కిలోమీటర్లు డ్రైవింగ్ చేసి పలువురి మన్ననలు పొందింది. - మదనపల్లె
డ్రైవింగే నా ఊపిరి..
పదేళ్లుగా పైగా వందలాది మంది మహిళలు, విద్యార్థులు, యువతులకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చాను. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రధాన రహదారులు, ఖాళీ స్థలాల్లో శిక్షణ ఇస్తున్నాను. నా వద్ద డ్రైవింగ్ నేర్చుకున్న వారు విదేశాల్లో ఉపాధి పొందుతున్నారు. డ్రైవింగ్‌నే ఊపిరిగా భావిస్తున్నాను. ఇదే నాకు ఉపాధి.
- రేణుక (చిట్టి)
మహిళా హక్కులే ఊపిరిగా..
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను చైతన్యపరిచి మహిళా హక్కులపై అవగాహనతో సంఘటిత పరిచారు. వారి హక్కుల సాధన కోసం 25 ఏళ్లుగా అలుపెరగని పోరాటం. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభను చాటి ప్రశంసలతో గుర్తింపు పొందారు. ఇందుకు పలు సంస్థలు అవార్డులు అందజేశారు. ఆమె మదనపల్లె ఫోర్డు సంస్థ డెరైక్టర్ జల్లా లలితమ్మ. చదువుకునే రోజుల నుంచి మహిళా హక్కుల సాధనకు పలు ఆలోచనలు సాగించేవి. ఈ క్రమంలో 1992లో తంబళ్లపల్లెలో పీపుల్స్ ఆర్గనైజేషన్ రూరల్ డెవలప్‌మెంట్ (ఫోర్డు) స్వచ్ఛంద సంస్థను స్థాపిం చారు.
ప్రదానంగా మహిళలు, పిల్లల హక్కులు, వారిలో చైతన్యవంతులు చేయడం, వారి సమస్యలు వారే పరిష్కరించుకునే విధంగా నాయకత్వం పెంపొందించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం దాదాపు 25 మండలాల్లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. లలితమ్మ కృషికి 2014 డిసెంబర్‌లో డాక్టర్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు దక్కింది. 2007లో నేపాల్‌లో నిర్వహిం్చన నాయత్వం చర్చావేదికలో పాల్గొన్నారు. ఏపీ బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఏపీ మహిళా వేదిక రాయలసీమ కార్యదర్శిగా పని చేస్తున్నారు.
- మదనపల్లె సిటీ
నమో శక్తి స్వరూపిణి
Published Sun, Mar 8 2015 1:19 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement