ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం | Inter Student And Private Employee Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం

Published Fri, Jan 10 2020 9:31 AM | Last Updated on Fri, Jan 10 2020 9:31 AM

Inter Student And Private Employee Missing in Hyderabad - Sakshi

పత్లావత్‌ రేణుక (ఫైల్‌) ,జ్యోత్స్న లత (ఫైల్‌)

సైదాబాద్‌: హాస్టల్‌ ఉంటూ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన సంఘటన సైదాబాద్‌ పోలీస్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.  పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మహబూబ్‌నగర్‌ జిల్లా, చంద్రదాన గ్రామం, పుల్సింగ్‌తండాకు చెందిన పత్లావత్‌ రేణుక(17) ఐఎస్‌సదన్‌ డివిజన్, వినయ్‌నగర్‌ కాలనీలోని నాయుడు హాస్టల్‌లో ఉంటూ స్థానికంగా ఉండే సంఘం లక్ష్మిబాయి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7న  సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. దీంతో హాస్టల్‌ నిర్వాహకులు  కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బంధువు పరుశురాం గురువారం సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రైవేట్‌ ఉద్యోగిని..
మల్కాజిగిరి:ప్రైవేట్‌ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.దయానంద్‌నగర్‌ సాయికృప ఎంపైర్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తొగర్‌ క్లెమెంట్‌ దైవకర్‌ భార్య జ్యోత్స్న లత గచ్చిబౌలిలోని అభిరాం డెవలపర్స్‌లో జీఎంగా పనిచేస్తోంది. ఈ నెల 8 న డ్యూటీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాఆఫ్‌ వస్తుండడంతో ఆమె భర్త దైవకర్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
ఉప్పల్‌: రామంతాపూర్‌ డాన్‌బాస్కో నవజీవన్‌ అనాథాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆశ్రమంలో ఉంటున్న కోడి అఖిల్, నడిపి పోలు అనే విద్యార్థులు ఈ నెల 8న ఉదయం ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు. వారికోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సొసైటీ ఇన్‌చార్జి  శిల్వరాజు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement