
రహమత్ బేగం (ఫైల్) మౌనిక(ఫైల్)
కాచిగూడ: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌ఏ్టషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మధు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ డివిజన్, మోతీమార్కెట్ ప్రాంతానికి చెందిన ఫక్రుద్దీన్ కుమార్తె రహమత్ బేగం (19) నారాయణగూడలోని సమత డిగ్రీ కళాశాలలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 9న హైటెక్‌సిటీలో ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లిన రహమత్ బేగం తిరిగి ఇంటికి రాలేదు. వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి ఫక్రుద్దీన్ బుధవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గృహిణి ...
మీర్‌పేట: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాఘవేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్‌పేట, కేశవరెడ్డినగర్‌కు చెందిన రాంచందర్ కుమార్తె మౌనిక (25)కు సురేష్‌తో వివాహం జరిగింది. గత నెల 29న పుట్టింటికి వచ్చిన మౌనిక తన వస్తువులను ఇంట్లో పెట్టి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె సోదరుడు అశోక్ బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment