మంజుల (ఫైల్) ,రోజ (ఫైల్)
బాలానగర్: ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహిదుద్దీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గౌతంనగర్‌కు చెందిన మంజుల (23) శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె సెల్ ఫోన్ సిచ్చాఫ్ చేసి ఉండటంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. ఆమె తల్లి మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి ఇష్టం లేదని యువతి..
కేపీహెచ్‌బీకాలనీ: పెళ్లి ఇష్టం లేదని ఓ యువతి అదృశ్యమైన సంఘటన శుక్రవారం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ అదే ప్రాంతంలోని స్వాతి హాస్టల్‌లో ఉంటున్న రోజకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 4న తన సోదరికి ఫోన్ చేసిన రోజా నిశ్చితార్థం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, తాను మరో వ్యక్తిని ఇష్టపడుతున్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా లభ్యం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment