
దుండిగల్:ఐ మిస్ యూ.. నేను చనిపోతున్నా.. అంటూ ఓ వ్యక్తి తన స్నేహితులకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి అదృశ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విఠల్ నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం కాలనీ, సుభాష్‌చంద్రబోస్ నగర్‌కు చెందిన కె.తిరుపతిరెడ్డి (34) డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ నెల 8న రాత్రి అతను తన స్నేహితులైన నాగరాజుగౌడ్, సత్యనారాయణ, కమలాకర్‌రావు లకు ‘నేను చనిపోతున్నా.. ఐమిస్ యూ అంటూ’ .. మెసేజ్ పెట్టాడు. స్నేహితులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుపతిరెడ్డి బావమరిది శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సోమవారం దుండిగల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment