షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ | IT major Infosys skip campus hiring this year wag hikes from November 1 | Sakshi
Sakshi News home page

Infosys: షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌!

Published Thu, Oct 12 2023 6:56 PM | Last Updated on Thu, Oct 12 2023 7:05 PM

IT major Infosys skip campus hiring this year wag hikes from November 1 - Sakshi

దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది.  రెండో త్రైమాసికంలో నికర లాభం 3.1 శాతం పెరిగి లాభం రూ.6,215 కోట్లగా నమోదైంది. ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరింది. అలాగే లితాల అనంతరం విలేకరుల సమావేశంలో సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ   ఉద్యోగుల్లో అసమర్థతలను కంపెనీ మోస్తోందన్నారు.

సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది.ఇన్ఫోసిస్ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయ మార్గదర్శకాలను 1 నుండి 2.5 శాతానికి తగ్గించింది. ఇంతకు ముందు రెవెన్యూ గైడెన్స్ 1 నుంచి 3.5 శాతంగా ఉండేది. అంతేకాదు ఏడాది కూడా క్యాంపస్ నియామకాలనలేవని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఫ్రెషర్లు ఎదుర్కొంటున్న ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై స్పందిస్తూ ఇప్పటికే ఉన్న ఆఫర్‌లకు తగిన సమయంలో కట్టుబడి ఉంది.

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 7,500మేర తగ్గింది.త్రైమాసికం క్రితం 17.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 14.6శాతానికి కి తగ్గిందిసెప్టెంబర్ త్రైమాసికంలో దాని మొత్తం సిబ్బంది సంఖ్య 7,530 తగ్గి 328,764కి చేరింది. యుఎస్‌లో కొనసాగుతున్న మాంద్యం భయాల మధ్య బలహీనమైన డీల్ పైప్‌లైన్ కారణంగా ఐటి సంస్థలు ఇప్పుడు ఫ్రెషర్‌లను నియమించుకోవడాన్ని తగ్గించుకోవాలని యోచిస్తున్నాయి.

జీతాల పెంపు ఆలస్యం
వేతనాల పెంపు ఆలస్యం చేస్తూ ఉద్యోగులను షాకిచ్చింది. నవంబర్ 1 నుండి తన వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ తెలిపారు. కంపెనీ ఏప్రిల్‌లో సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు, ఆ పైన జూలైలో పైన ఉన్నవారికి పెంపుదల ఉంటుంది. ఈ ఆలస్యానికి గల కారణాలను కంపెనీ స్పష్టం చేయలేదు. మరోవైపు Wipro, మెరిట్ జీతాల పెంపుదల డిసెంబర్ 1 కి వాయిదా వేస్తున్నట్టు ఉద్యోగులకు తెలియజేసింది. HCLTech జూనియర్ ఉద్యోగులకు త్రైమాసిక పెంపుదలని వాయిదా వేసింది . సీనియర్ మేనేజ్‌మెంట్ కోసం మెరిట్ పెంపుదలని దాటవేస్తున్నట్లు  ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement