
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిపాజిటరీ సేవల దిగ్గజం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్‌ఎల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 80 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 86 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం పుంజుకుని రూ.170 కోట్లను తాకింది.
గత క్యూ2లో రూ. 165 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు కొత్తగా 48 లక్షల డీమ్యాట్ ఖాతాలను తెరచినట్లు కంపెనీ వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యూహాలలో భాగంగా డిజిటల్ ఎకోసిస్టమ్‌పై వెచ్చిస్తున్న పెట్టుబడులు ఫలితాలనిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో నేహల్ వోరా పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో సీడీఎస్‌ఎల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో నామమాత్రంగా లాభపడి రూ. 1,228 వద్ద ముగిసింది.
చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే!
Comments
Please login to add a commentAdd a comment