
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా కాఫీ (టీసీఎల్) నికర లాభం (కన్సాలిడేటెడ్) రూ.46 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 62 కోట్లతో పోలిస్తే 26 శాతం క్షీణించింది. అటు ఆదాయం రూ. 592 కోట్ల నుంచి 9 శాతం క్షీణించి రూ. 538 కోట్లకు పరిమితమైంది. గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ మొత్తం మీద తాము మెరుగైన పనితీరు కనపర్చగలిగామని కంపెనీ ఎండీ చాకో పి. థామస్ తెలిపారు.
నిల్వ.. రవాణాపరంగాను, ముడి వస్తువుల ధరలపరంగానూ సమస్యలు ఎదురైనా తొలి త్రైమాసికంలో ఇన్‌స్టంట్ కాఫీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని వివరించారు. వియత్నాంలోని తమ కార్యకలాపాలు, ఆర్డర్ల సంఖ్య మెరుగుపడినట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం టీసీఎల్ షేర్లు సుమారు 9 శాతం క్షీణించి రూ. 215 వద్ద క్లోజయ్యాయి. బుధవారం టీసీఎల్ షేర్లు సుమారు 9 శాతం క్షీణించి రూ. 215 వద్ద క్లోజయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment