న్యూఢిల్లీ: లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 1,381 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 622 కోట్లు.
సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం 48 శాతం పెరిగి రూ. 1,476 కోట్ల నుంచి రూ. 2,181 కోట్లకు చేరింది. ప్రథమార్ధంలో నికర లాభం రూ. 1,150 కోట్ల నుంచి రూ. 2,027 కోట్లకు ఎగిసింది. మొత్తం ఆదాయం రూ. 2,998 కోట్ల నుంచి రూ. 3,910 కోట్లకు చేరింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో డీఎల్‌ఎఫ్ దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ.ఇది ప్రాథమికంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అభివృద్ధి, విక్రయాలతోపాటు కమర్షియల్, రిటైల్ ప్రాపర్టీల అభివృద్ధి, లీజింగ్ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment