
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 828 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 567 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,130 కోట్ల నుంచి రూ. 6,066 కోట్లకు ఎగసింది.
ఎల్‌ఐసీ నియంత్రణలోని బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 21.85 శాతం నుంచి 16.51 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్‌పీఏలు 1.71 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గాయి. మొండి రుణాలు, కంటింజెన్సీలకు కేటాయింపులు రూ. 571 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 771 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 1.4 శాతం నీరసించి రూ. 44 వద్ద ముగిసింది.
చదవండి: భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
Comments
Please login to add a commentAdd a comment