
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ జ్యోతీ ల్యాబ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 77% పైగా జంప్‌చేసి రూ. 674 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 380 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,390 కోట్ల నుంచి రూ. 6,127 కోట్లకు ఎగసింది.
అధిక కమోడిటీ ధరలు వినియోగాన్ని దెబ్బతీసినప్పటికీ పటిష్ట బిజినెస్‌ను సాధించగలిగినట్లు కంపెనీ పేర్కొంది. నూతన ప్రొడక్టులు, మెరుగైన పంపిణీ, కొత్త ప్రాంతాలకు విస్తరించడం వంటి వ్యూహాలను అమలు చేయడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎంఆర్ జ్యోతి పేర్కొన్నారు.
చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్!