![Gland Pharma Q2 Results: Profit Rs 241 Crore - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/27/Untitled-1_3.jpg.webp?itok=Kcf0w0VN)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ గ్లాండ్ ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.241 కోట్లు నమోదు చేసింది. వ్యయాలు రూ.731 కోట్ల నుంచి రూ.786 కోట్లకు ఎగశాయి. టర్నోవర్ రూ.1,080 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్ల నుంచి టర్నోవర్ 3 శాతం పెరిగి రూ.747 కోట్లుగా ఉంది.
ఆదాయం భారత విపణి నుంచి 42 శాతం తగ్గి రూ.73 కోట్లకు, ఇతర మార్కెట్ల నుంచి 3 శాతం క్షీణించి రూ.224 కోట్లకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే గ్లాండ్ ఫార్మా షేరు ధర బీఎస్‌ఈలో బుధవారం 1.57 శాతం పెరిగి రూ.2,224.20 వద్ద స్థిరపడింది.
చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా
Comments
Please login to add a commentAdd a comment