న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్ రంగ దిగ్గజం అరవింద్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 98 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,270 కోట్ల నుంచి రూ. 1,980 కోట్లకు బలహీనపడింది.
అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,135 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు తగ్గాయి. కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలిక రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు అరవింద్ పేర్కొంది. దీనిలో భాగంగా క్యూ3లో రూ. 135 కోట్లు తిరిగి చెల్లించడం ద్వారా 2022 డిసెంబర్31కల్లా దీర్ఘకాలిక రుణాలు రూ. 739 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అరవింద్ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 85 వద్ద ముగిసింది.
చదవండి: ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment