న్యూఢిల్లీ: డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం పెరిగి రూ.254 కోట్లకు చేరింది. ఆదాయం సైతం రూ.3,000 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.158 కోట్లు, ఆదాయం రూ.2,025 కోట్లుగా ఉన్నాయి.
ఢిల్లీకి చెందిన డీసీఎం శ్రీరామ్ క్లోరో వినిల్ కెమికల్, షుగర్, ఫెర్టిలైజర్స్, బయోసీడ్స్ వ్యాపారాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘ఎన్నో దశాబ్దాల తర్వాత ప్రపంచం వ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నాం. సరఫరా వైపు సమస్యలు, కీలక కమోడిటీల ధరలు పెరిగిపోయాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి.
కరెన్సీలు చారిత్రంగా కనిష్టాలను చూస్తున్నాయి. ఇదంతా అనిశ్చిత వాతావరణానికి దారితీసింది, కంపెనీ బ్యాలన్స్ షీటు బలంగా ఉండడంతో వీటిని మెరుగ్గా అధిగమించింది’’అని సంస్థ చైర్మన్, ఎండీ అజయ్ శ్రీరామ్, వైస్ చైర్మన్, ఎండీ విక్రమ్ శ్రీరామ్ తెలిపారు. కెమికల్స్, షుగర్ వ్యాపారంలో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే 12 నెలల్లో వీటి నుంచి కార్యకలాపాలు మొదలవుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment