ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22%ఎగసి రూ. 11,125 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 20 శాతం పుంజుకుని రూ. 10,606 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 8,834 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం బలపడి రూ. 21,201 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ 4.1 శాతంగా నమోదయ్యాయి.
ఎన్‌పీఏలు మెరుగు
ప్రస్తుత క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.35 శాతం నుంచి 1.23 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీల కేటాయింపులు రూ. 3,925 కోట్ల నుంచి తగ్గి రూ. 3,240 కోట్లకు పరిమితమయ్యాయి. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ విలీనంపై వాటాదారుల సమావేశ నిర్వహణకు ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 40 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌కు 2022 ఏప్రిల్ 4న తెరలేచిన విషయం విదితమే.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment