రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ది బిగ్‌బుల్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడు. షేర్ మార్కెట్ పండితుడిగా పేరుమోసిన ఈ ఏస్ ఇన్వెస్టర్ మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. స్టాక్‌మార్కెట్ వ్యాపారంలోనే వేల కోట్లు సంపాదించిన కుబేరుడి ఖాతాలో మరికొన్ని కోట్లు వచ్చి చేరాయి, అది కూడా 24 గంటల వ్యవధిలోనే కావడం విశేషం.
బిగ్‌బుల్ తరీఖా
ఇటీవల జీ మీడియా గ్రూపు షేర్లు మార్కెట్‌లో ఒడిదుడుకులకు లోనయ్యాయి. జీ గ్రూప్ ఎండీ పదవి నుంచి పునీత్ గోయెంకాను తొలగించాలంటూ పెట్టుబడిదారులు పట్టుబట్టారు. దీంతో సెప్టెంబరు 14న మంగళవారం ఆ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవి చూశాయి. ఆ కంపెనీ షేర్ల ధర పడిపోతూ రూ.220.44 దగ్గర ఉన్నప్పుడు వాటిపై బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రారే కంపెనీ కన్నేసింది. అదే ధర దగ్గర ఒకేసారి 50 లక్షల షేర్లను కొనుగోలు చేశారు.
ఒక్కరోజులోనే
ఒక షేరు ధర 220.44 దగ్గర ఉండగా రాకేశ్ ఝున్‌ఝున్ వాలా భారీగా షేర్లు కొన్నాడంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా షేర్ ధర పుంజుకుంది.అదే రోజు సాయంత్రానిని కోలుకుని ఒక షేరు ధర రూ, 261.50 దగ్గర క్లోజయ్యింది. దీంతో సరాసరి రూ. 20 కోట్ల మేర ఆదాయం ఝున్‌ఝున్‌వాలా ఖాతాలో పడింది. గురువారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి జీ షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయిలను తాకుతూ ఇంట్రాడేలో రూ. 295.15 దగ్గర ట్రేడవుతూ ఆయన ఖాతాలోకి మరింత సొమ్మును జత చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment