న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022) మూడో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ3)లో నికర లాభం 8 శాతం బలపడి రూ. 668 కోట్లను అధిగమించింది. గతేడాది(2021) ఇదే కాలంలో రూ. 617 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 18 శాతం వృద్ధితో రూ. 4,591 కోట్లను తాకాయి. గత క్యూ3లో రూ. 3,883 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ క్యాలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. వాటాదారులకు రెండో మధ్యంతర డివి డెండ్ కింద షేరుకి రూ.120 చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది.
త్రైమాసిక రికార్డ్..: గత ఐదేళ్లలో ఒక త్రైమాసికానికి అమ్మకాల్లో అత్యధిక వృద్ధిని అందుకున్నట్లు ఈ సందర్భంగా నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ తెలియజేశారు. దేశీ అమ్మకాలు 18 శాతంపైగా ఎగసి రూ. 4,361 కోట్లను దాటాయి.
కస్టమర్ల వద్దకే నెస్లే
మైనెస్లే పేరుతో డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ) విభాగంలోకి (ఆన్‌లైన్) కంపెనీ ప్రవేశించింది.తొలుత ఢిల్లీ రాజధాని ప్రాంత కస్టమర్లకు ఈ సేవలను పరిచయం చేయనున్నారు. తరువాత దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో నెస్లే ఇండియా షేరు 2 శాతం లాభపడి రూ. 19,800 వద్ద ముగిసింది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment