
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. గతేడాది ఇదే కాలానికి సంబంధించిన ఫలితాలతో పోల్చితే ఏకంగా 25 రెట్లు లాభాలను ఆర్జించి రికార్డు సృష్టించింది. పన్నెండు నెలల వ్యవధిలోనే ఫలితాల్లో అబ్బురపరిచే మార్పు కనబరిచింది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 2022 జనవరి 28న ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రూ.707 కోట్ల లాభం ఆర్జించినట్టుగా వెల్లడించింది. మూడో త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ రూ.5,319 కోట్లుగా నమోదు అయ్యింది. గతేడాది క్యూ 3లో రూ. 4,929 కోట్ల రెవెన్యూపై కేవలం రూ.27.90 కోట్ల లాభాలకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment