సోషల్ మీడియా దిగ్గజం మెటాకు చెందిన అడ్వర్టయిజ్‌మెంట్ యూనిట్ ఫేస్‌బుక్ ఇండియా ఆన్‌లైన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ టోఫ్లర్ వివరాల ప్రకారం నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ.505 కోట్లను తాకింది.
టోఫ్లర్ తెలిపిన వివరాల ప్రకారం..ఫేస్‌బుక్ ఇండియా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.353 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కానీ 2023-24 ఏడాదిలో ఇది 43 శాతం పెరిగి రూ.505 కోట్లను తాకింది. కంపెనీ దేశీయంగా అడ్వర్టయిజింగ్ ఇన్వెంటరీని కస్టమర్లకు విక్రయించే సర్వీసులతోపాటు మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్‌కు ఐటీ ఆధారిత సపోర్ట్, డిజైన్ సపోర్ట్ సేవలు సైతం అందిస్తోంది. కాగా..2023-24లో టర్నోవర్ 9 శాతంపైగా ఎగసి రూ.3,035 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ.2,776 కోట్ల ఆదాయం నమోదైంది.
ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!
ఫేస్‌బుక్ ఇండియా విభాగంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, సపోర్ట్ సర్వీస్..వంటి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు 67,317 మందికి ఉపాధి కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment