విశాఖ స్టీల్‌ప్లాంట్ 2021–22 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,923 కోట్ల లాభం అర్జించింది. బుధవారం స్టీల్‌ప్లాంట్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో, స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ ఏడాది ప్లాంట్ అత్యధికంగా రూ. 28,215 కోట్లు టర్నోవర్ సాధించిందని, గత ఏడాదితో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. అలాగే కంపెనీ ఆరేళ్ల తర్వాత పన్నుకు ముందు లాభాలను (పీబీటీ) అర్జించిందన్నారు.
గత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ అంతకు ముందు ఏడాది కంటే 148 శాతం వృధ్దితో రూ.3,469 కోట్ల ఎబిటా సాధించిందన్నారు. కోకింగ్ కోల్ సంక్షోభం కారణంగా క్యూ4లో కార్యకలాపాలు తగ్గినప్పటికి, అన్ని ప్రధాన ఉత్పత్తి రంగాల్లో అత్యుత్తమ పనితీరు నమోదు చేసిందన్నారు. స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరక్టర్లు సీతా సిన్హా, ఘన శ్యాం సింగ్, సునీల్ కుమార్ హిరానీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉక్కు మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ ఎస్. నారాయణస్వామి న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏజీఎంకు హాజరయ్యారు.
చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment