ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 55% జంప్‌చేసి రూ. 7,384 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 4,616 కోట్ల నుంచి రూ. 6,905 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% పుంజుకుని రూ. 13,210 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.89% నుంచి 4.01 శాతానికి బలపడ్డాయి. మొత్తం ప్రొవిజన్లు సగానికిపైగా తగ్గి రూ. 1,143 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 2,851 కోట్ల కేటాయింపులు చేపట్టింది.
ఎన్‌పీఏలు డౌన్
ప్రస్తుత సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 5.15 శాతం నుంచి 3.41 శాతానికి తగ్గాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 5,825 కోట్లకు పరిమితంకాగా.. గత క్యూ1లో 7,231 కోట్లుగా నమోదయ్యాయి. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌తో భాగస్వామ్యం ద్వారా 32 లక్షల క్రెడిట్ కార్డులను విక్రయించినట్లు బ్యాంక్ వెల్లడించింది. అనుబంధ సంస్థలలో జీవిత బీమా సంస్థ రూ. 156 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో రూ. 186 కోట్ల నికర నష్టం నమోదైంది. సాధారణ బీమా విభాగం నికర లాభం 79 శాతం ఎగసి రూ. 349 కోట్లను తాకింది. కనీస మూలధన నిష్పత్తి 18.7 శాతానికి చేరింది.
చదవండి: Ford: భారీ షాక్.. భారత్ నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ!
Comments
Please login to add a commentAdd a comment