
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డ్ నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 34.8 శాతం తగ్గి రూ.79 కోట్లు నమోదు చేసింది. ఎబిటా 10.2 శాతం తగ్గి రూ.186 కోట్లు, ఎబిటా మార్జిన్ 532 బేసిస్ పాయింట్లు తగ్గి 13.4 శాతంగా ఉంది. టర్నోవర్ 25 శాతం ఎగసి రూ.1,396 కోట్లు సాధించింది.
చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి!
Comments
Please login to add a commentAdd a comment