Engineering services
-
మోల్డ్‌టెక్ బోర్డులోకి ప్రసాద్ రాజు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ డైరెక్టర్ల బోర్డులోకి కోసూరి ప్రసాద్ రాజు చేరారు. ప్రస్తుతం కంపెనీ యూఎస్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌లో ప్రసాద్ రాజు తొలి ఉద్యోగి కావడం విశేషం. రెండు దశాబ్దాలుగా ప్లానింగ్, ప్రొడక్షన్ బాధ్యతలతోపాటు యూఎస్ఏ మార్కెటింగ్, న్యూ బిజినెస్ డెవలప్మెంట్కు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కృషి, దూరదృష్టి, అంకితభావం మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌ను ఉన్నత దిశలోకి నడిపిస్తాయని కంపెనీ సీఎండీ జె.లక్ష్మణ రావు పేర్కొన్నారు. -
పెన్నార్‌కు రూ.1,167 కోట్ల ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ పరికరాల తయారీ సంస్థ పెన్నార్ గ్రూప్ సెప్టెంబర్‌లో రూ.1,167 కోట్ల ఆర్డర్లను చేజిక్కించుకుంది. వీటిలో ఎన్టీపీసీ రెనివేబుల్ ఎనర్జీ నుంచి కూడా ఆర్డర్ పొందామని పెన్నార్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కూరం వెల్లడించారు. ‘రాజస్తాన్‌లో ఎన్టీపీసీ 500 మెగావాట్ల ఏసీ/625 మెగావాట్ల డీసీ సోలార్ పీవీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. డిజైన్, సరఫరా, నిర్మాణం ప్రాతిపదికన పెన్నార్ ఇండస్ట్రీస్ 12.5 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు సంస్థ స్వీకరిస్తుంది’ అని వివరించారు. రిలయన్స్, టీసీఐ లిమిటెడ్, థెర్మాక్స్, టాటా నుంచి సైతం పెన్నార్ గ్రూప్ కంపెనీలు ఆర్డర్లను పొందాయి. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
సైయంట్ మధ్యంతర డివిడెండ్ రూ.10
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డ్ నిర్ణయించింది. సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 34.8 శాతం తగ్గి రూ.79 కోట్లు నమోదు చేసింది. ఎబిటా 10.2 శాతం తగ్గి రూ.186 కోట్లు, ఎబిటా మార్జిన్ 532 బేసిస్ పాయింట్లు తగ్గి 13.4 శాతంగా ఉంది. టర్నోవర్ 25 శాతం ఎగసి రూ.1,396 కోట్లు సాధించింది. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగాల్లోని 190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు. -
Army Jobs: 502 ఆర్మీ పోస్టులు, నెలకు రూ.35,400
భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్వైజర్(బ్యారక్ స్టోర్), డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్ నోటిఫికేషన్–2021 విడుదలైంది. మిలిటరీ సర్వీస్‌లో సేవలు అందించాలనుకునే అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ఖాళీలు, విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం... పోస్టుల సంఖ్య: 502 ఎంఈఎస్–2021 నోటిఫికేషన్ ద్వారా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్వైజర్ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు ► డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్ జిరాక్స్, ప్రింటింగ్ అండ్ లామినేషన్ మెషీన్‌పై ఏడాది కాలం అనుభవం అవసరం. ► సూపర్వైజర్ పోస్టులకు ఎకనామిక్స్/కామర్స్/స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్ అండ్ అకౌంట్స్ మెయింటెనెన్స్‌లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్/కామర్స్/ స్టాటిస్టిక్స్/బిజినెస్ స్టడీస్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు మెటీరియల్ మేనేజ్మెంట్/వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్/ పర్చేజ్/లాజిస్టిక్స్/ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో డిప్లొమా,స్టోర్స్ అకౌంట్స్ మెయింటెనెన్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ► రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు. వేతనం ► సూపర్వైజర్, డ్రాఫ్ట్స్మెన్గా ఎంపికైనవారు పే లెవెల్–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది. పరీక్ష విధానం ► పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానం ఉం టుంది. 125 మార్కులకు 100 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. సిలబస్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్– 25 ప్రశ్నలు –25 మార్కులు; ► జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లిష్– 25 ప్రశ్నలు–25 మార్కులు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్–25 ప్రశ్నలు –25 మార్కులు; ► స్పెషలైజ్డ్ టాపిక్ – 25 ప్రశ్నలు– 50 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ► దరఖాస్తులకు చివరి తేదీ: 12.04.2021 ► రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు) ► రాత పరీక్ష తేది: 16.05.2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం ► వెబ్సైట్: దరఖాస్తు కోసం https://www.mesgovonline.com/mesdmsk/లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ లింక్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్ -
కష్టపడితే ఇంజనీరింగ్ సర్వీసెస్ సులువే!
సక్సెస్ స్టోరీ అమ్మాన్నాన్న ఇద్దరూ సివిల్ ఇంజనీర్లే. అందుకు తగ్గట్లుగా ఆ యువకుడికి కూడా ఇంజనీరింగ్ సబ్జెక్టులంటే అమితాసక్తి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ సర్వీసులో చేరాలనే లక్ష్యం.. కలిసి అతడిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్) -2014 రాసేలా చేశాయి. లక్షల మంది పోటీని ఎదుర్కొని ఐఈఎస్ (సివిల్ ఇంజనీరింగ్ విభాగం) లో జాతీయస్థాయిలో 25వ ర్యాంకును సాధించాడు తిరుపతికి చెందిన జిల్లెల్ల అభిషేక్. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో చేరి సమాజాభివృద్ధికి సేవ చేస్తానంటున్న అభిషేక్ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం.. మా స్వస్థలం తిరుపతి. నాన్న జి.ప్రభాకర్‌రావు ఏపీ రోడ్లు, భవనాల శాఖ రాజంపేట కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ రోజారమణి ఏపీ పంచాయతీరాజ్ శాఖ-తిరుపతిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నా చదువు విషయంలో అమ్మానాన్న నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎంచుకున్న కోర్సును విజయవంతంగా పూర్తి చేయడానికి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. ఆశించిన ర్యాంకులు, ఫలితాలు సాధించలేకపోయినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించారు. గేట్లో ఆశించిన ర్యాంకు రాలేదని నేను కలత చెందినప్పుడు నాలో ధైర్యం నింపారు. అదే స్ఫూర్తిని కొనసాగించి ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో విజయం సాధించాను. చదువులో ముందంజ ఇంటర్ వరకు తిరుపతిలోనే చదివాను. పదో తరగతిలో 94 శాతం, ఇంటర్లో 97 శాతం మార్కులు సాధించాను. ఏఐట్రిపుల్ఈ-2009లో జాతీయస్థాయిలో 4200 ర్యాంకు సాధించి ఎన్ఐటీ- తిరుచిరాపల్లిలో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాను. బీటెక్‌లో 94.4 శాతం మార్కులు వచ్చాయి. తర్వాత గేట్లో 496 ర్యాంకు సాధించాను. ప్రస్తుతం ఐఐటీ- బాంబేలో ఎంటెక్ చేస్తున్నాను. బీటెక్‌లోనే కోచింగ్ బీటెక్ మూడో ఏడాది సెలవుల్లో హైదరాబాద్‌లో ఐఈఎస్‌కు రెండు నెలలు కోచింగ్ తీసుకున్నాను. అయితే బీటెక్ పూర్తయ్యేనాటికి నాకు 21 ఏళ్లు నిండలేదు. ఐఈఎస్‌కు హాజరయ్యేందుకు కనీస వయసు లేనందున పరీక్ష రాయలేకపోయాను. దీంతో ప్రిపరేషన్‌కు మరో ఏడాది సమయం లభించింది. దాంతో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకున్నాను. ఏడాదిపాటు ఐఈఎస్‌కు కష్టపడి చదివాను. ప్రిపరేషన్ ఐఈఎస్‌కు బీటెక్ సిలబస్ మించి సిద్ధమవ్వాలి. ఐఈఎస్‌లో అడిగే ప్రశ్నలతో పోల్చుకుంటే బీటెక్‌లో నేర్చుకుంది చాలా తక్కువ అనిపిస్తుంది. అయినప్పటికీ పట్టుదల, పక్కా ప్రణాళిక ఉంటే ఐఈఎస్ కలను సొంతం చేసుకోవచ్చు. శిక్ష ణలో రోజుకు 4 నుంచి 5 గంటలు తగ్గకుండా ఇంజనీరింగ్ సబ్జెక్టులను చదివేవాడిని. పుస్తకాలతోపాటు మానసిక ఉల్లాసానికి ప్రాధ్యానతనిచ్చాను. నేను స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్‌ని. రోజూ గంట నుంచి గంటన్నర వరకు శారీరక వ్యాయామం చేసేవాడిని. దీనివల్ల మంచి ఉత్తేజం లభించేది. పరీక్ష విధానం ఐఈఎస్ పరీక్షను సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో నిర్వహిస్తారు. రాత పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1 జనరల్ ఎబిలిటీ టెస్ట్‌తోపాటు ఇంజనీరింగ్‌కు సంబంధించిన రెండు పేపర్లుంటాయి. సెక్షన్ -1 పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. సెక్షన్-2లో ఇంజనీరింగ్‌కు సంబంధించిన రెండు కన్వెన్షనల్ పేపర్లు ఉంటాయి. రాత పరీక్షలో ఒక్కో పేపర్‌కు 200 మార్కుల చొప్పున మొత్తం ఐదు పేపర్లకు కలిపి 1000 మార్కులుంటాయి. పరీక్ష ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు. ఇంటర్వ్యూ సాగిందిలా ఐదుగురు సభ్యులున్న మన్బీర్ సింగ్ ప్యానెల్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. ఉత్తరాఖండ్ వరదలపై, ప్రకృతి, మానవ కారణాల విశ్లేషణపై ప్రశ్నలు అడిగారు. తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన నాలుగు సబ్జెక్టులు.. ఆర్సీసీ, బిల్డింగ్ మెటీరియల్స్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్‌పై ప్రశ్నలు అడిగారు. అరగంట సేపు ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూ సాగింది. లక్ష్యం ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో నేను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగాన్ని ఎంచుకున్నాను. ప్రజలకు సేవ చేయడానికి వీలయ్యే ఈ రంగం అంటే నాకెంతో ఆసక్తి. అంకిత భావంతో పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేదే నా లక్ష్యం. సలహా గేట్లో ప్రతిభ చూపినవారు మాత్రమే ఐఈఎస్‌లో రాణిస్తారనేది చాలామంది అపోహ. గేట్ లో ఆశించిన ఫలితాలు సాధించపోతే కుంగిపోతారు. కానీ గేట్లో విఫలమైనా ఐఈఎస్‌లో విజయం సాధించొచ్చు. పరీక్షకు ముందు ఆర్నెల్లు కష్టపడి చదవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. ఇంజనీరింగ్ సబ్జెక్టులపై పట్టు ఉండి, కష్టపడి చదివితే సులువుగా విజయం సాధించొచ్చు.