
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ డైరెక్టర్ల బోర్డులోకి కోసూరి ప్రసాద్ రాజు చేరారు. ప్రస్తుతం కంపెనీ యూఎస్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌లో ప్రసాద్ రాజు తొలి ఉద్యోగి కావడం విశేషం.
రెండు దశాబ్దాలుగా ప్లానింగ్, ప్రొడక్షన్ బాధ్యతలతోపాటు యూఎస్‌ఏ మార్కెటింగ్, న్యూ బిజినెస్ డెవలప్‌మెంట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కృషి, దూరదృష్టి, అంకితభావం మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌ను ఉన్నత దిశలోకి నడిపిస్తాయని కంపెనీ సీఎండీ జె.లక్ష్మణ రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment