Mold tech
-
మోల్డ్‌టెక్ బోర్డులోకి ప్రసాద్ రాజు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ డైరెక్టర్ల బోర్డులోకి కోసూరి ప్రసాద్ రాజు చేరారు. ప్రస్తుతం కంపెనీ యూఎస్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌లో ప్రసాద్ రాజు తొలి ఉద్యోగి కావడం విశేషం. రెండు దశాబ్దాలుగా ప్లానింగ్, ప్రొడక్షన్ బాధ్యతలతోపాటు యూఎస్ఏ మార్కెటింగ్, న్యూ బిజినెస్ డెవలప్మెంట్కు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కృషి, దూరదృష్టి, అంకితభావం మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌ను ఉన్నత దిశలోకి నడిపిస్తాయని కంపెనీ సీఎండీ జె.లక్ష్మణ రావు పేర్కొన్నారు. -
ఇది ఊహించలేదు.. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ లాభం 452శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికరలాభం అంత క్రితంతో పోలిస్తే 452.5% ఎగసి రూ.9.2 కోట్లు సాధించింది. ఎబిటా 300 శాతం పెరిగి రూ.13.6 కోట్లకు చేరింది. టర్నోవర్ 71% అధికమై రూ.40.7 కోట్లుగా ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల మోడళ్లకు 3డీ, 2డీ, రోబోటిక్స్ సేవలను అందిస్తున్నామని మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ సీఎండీ జె.లక్ష్మణ రావు తెలిపారు. ‘ఇటువంటి సర్వీసులను ఆఫర్ చేస్తున్న అతికొద్ది భారతీయ కంపెనీల్లో మోల్డ్‌టెక్ ఒకటి. యూరప్, మెక్సికో నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. కనెక్షన్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైనింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీలను కొనుగోలు చేస్తాం. ఆర్డర్ బుక్ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ వృద్ధి కొనసాగుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
‘మహిళా రక్షణలో పోలీసులు భేష్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ సీఎండీ లక్ష్మణ్ ప్రశంసించారు. చిన్నారులు, మహిళలపై నమోదవుతున్న కేసుల్లో వేగంగా స్పందించేందుకు ఏర్పాటు చేసిన షీటీమ్స్, భరోసా కేంద్రాల పనితీరును ఆయన మెచ్చుకున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 20 లక్షలను డీజీపీ మహేందర్‌రెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రాకు అందజేశారు. -
మోల్డ్‌టెక్ మరో 3 ప్లాంట్లు
• 2018లో ఉత్పత్తి కార్యకలాపాలు • రూ.54 కోట్ల దాకా పెట్టుబడి • మూడో త్రైమాసికంలో తగ్గిన నికరలాభం • కంపెనీ సీఎండీ లక్ష్మణరావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ మరో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఏసియన్ పెయింట్స్ కోసం మైసూరు, వైజాగ్‌లో ప్లాంట్లు రానున్నాయి. స్థల సేకరణ కూడా పూర్తయింది. అలాగే మరో పెయింట్ కంపెనీ కోసం దక్షిణాదిన ఒక యూనిట్ ఏర్పాటు చేయనుంది. నెల రోజుల్లోగా ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు కానున్నట్లు తెలియవచ్చింది. ప్రతిపాదిత మూడు ప్లాంట్లలో 2018 జూన్–అక్టోబర్ కాలంలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఒక్కో యూనిట్లో తొలి దశ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3,500 టన్నులుంటుంది. మూడు ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం రూ.54 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్లు మోల్డ్‌టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. సామర్థ్యం రెట్టింపు.. నూతన కేంద్రాల సామర్థ్యాన్ని 2021 కల్లా రెట్టింపు చేస్తామని లక్ష్మణరావు తెలిపారు. ఇందుకోసం మరో రూ.27 కోట్ల దాకా ఖర్చవుతుందన్నారు. సంస్థకు ఇప్పటికే ఏడు ప్లాంట్లున్నాయి. ఈ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30,000 టన్నులు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,300 దాకా ఉంది. విస్తరణతో మరో 800 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. ప్యాకేజింగ్ సేవలందించేందుకు మరిన్ని ఫుడ్, ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, అవి పురోగతిలో ఉన్నాయని వివరించారు. నికర లాభం రూ.5.5 కోట్లు.. డిసెంబర్ త్రైమాసికం స్టాండెలోన్ ఫలితాల్లో మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.6 కోట్ల నుంచి రూ.5.5 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం రూ.75.7 కోట్ల నుంచి రూ.76 కోట్లకు ఎగసింది. ఫుడ్, ఎఫ్ఎంసీజీ విభాగం ప్రస్తుతం 7 శాతం సమకూరుస్తోంది. వచ్చే ఏడాది ఇది 15–20 శాతానికి చేరుతుందని కంపెనీ భావిస్తోంది.