prasad raju
-
మోల్డ్‌టెక్ బోర్డులోకి ప్రసాద్ రాజు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ మోల్డ్‌టెక్ టెక్నాలజీస్ డైరెక్టర్ల బోర్డులోకి కోసూరి ప్రసాద్ రాజు చేరారు. ప్రస్తుతం కంపెనీ యూఎస్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌లో ప్రసాద్ రాజు తొలి ఉద్యోగి కావడం విశేషం. రెండు దశాబ్దాలుగా ప్లానింగ్, ప్రొడక్షన్ బాధ్యతలతోపాటు యూఎస్ఏ మార్కెటింగ్, న్యూ బిజినెస్ డెవలప్మెంట్కు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కృషి, దూరదృష్టి, అంకితభావం మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌ను ఉన్నత దిశలోకి నడిపిస్తాయని కంపెనీ సీఎండీ జె.లక్ష్మణ రావు పేర్కొన్నారు. -
Jahnavi Dangeti: వ్యోమగామి కలకు సీఎం జగన్ చేయూత
సాక్షి, అమరావతి/పాలకొల్లు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ సీఎం వైఎస్ జగన్ రూ.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసినట్టు పౌరసంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. సచివాలయంలో బుధవారం జాహ్నవికి చెక్కును అందజేశారు. చదవాలనే తపన ఉండి నిరుపేద విద్యార్థులకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా నిలుస్తారని చెప్పారు. జాహ్నవి పంజాబ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతో నాసాతో పాటు పోలాండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందింది. అయితే వ్యోమగామికి అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉండగా ఆర్థిక సాయం నిమిత్తం సీఎంని కలిసి కోరగా సానుకూలంగా స్పందించారు. నెలలోపే ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. జాహ్నవి మాట్లాడుతూ సీఎం దీవెనలతో త్వరలోనే శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు. వ్యోమగామిగా దేశ కీర్తిని పెంచేందుకు కష్టపడతానని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాసరావు ఉన్నారు. విజయవాడలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను జాహ్నవి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జాహ్నవిని పద్మ సత్కరించారు. (క్లిక్ చేయండి: చరిత్ర సృష్టించిన జాహ్నవి.. స్పేస్ కావాలి!) -
చీఫ్ విప్ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం
దెందులూరు(పశ్చిమగోదావరి): ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్‌విప్‌గా ముదునూరి ప్రసాదరాజును ఎంపిక చేయడం వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏపీ చీఫ్‌విప్ చాంబర్లో ప్రసాదరాజును కలిశారు. శాలువా, బొకేతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు, దెందులూరు మండల పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని, పోతునూరు మాజీ సొసైటీ చైర్మన్ గూడపాటి పవన్‌కుమార్ ఉన్నారు. చదవండి: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం -
నరసాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రసాదరాజు ప్రచారం
-
నరసాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా ముదునూరి నామినేషన్
-
శ్రీవారికి బైక్ కానుకగా ఇచ్చిన భక్తుడు
తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు బైక్‌ను కానుకగా సమర్పించాడు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ప్రసాదరాజు అనే భక్తుడు స్వామి వారికి హీరో బైక్‌ను కానుకగా ఇచ్చాడు. టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో రామారావుకు బైక్‌ను ప్రసాదరాజుకు అందజేశారు. ఈ బైక్ ధర రూ. 72 వేలు అని భక్తుడు ప్రసాదరాజు తెలిపారు.