భారత్ గతంలో వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండేది. అధిక శాతం జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే ఏళ్లు గడిచే కొద్దీ వ్యవసాయానికి సాయం లేక డీలా పడిపోయింది. దీంతో వ్యవసాయ భూములు కాలం గడిచే కొద్దీ కనుమరుగవుతూ ఉన్నాయి. మరోవైపు ఇటీవల కొందరు రసాయనాల ద్వారా పంటలు పండిస్తున్నట్లు చాలా ఘటనల్లో నిరూపితమైంది. దీంతో ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకమైంది. ఈ తరుణంలో ఎటువంటి రసాయనాలు కలపకుండా సేంద్రీయ పద్ధతిలో సహజంగా పండించిన కూరగాయలు, పండ్లకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది.
మట్టి లేకుండా వ్యవసాయం..
అందుకే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓ వ్యక్తి తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చి ఏడాదికి 70 లక్షల సంపాదిస్తూ అందరికీ షాకిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ కి చెందిన రామ్ వీర్ సింగ్ అనే రైతు అతని ఇంటి మీద పంట వేయడమే కాకుండా లాభాల బాట పట్టించి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. గతంలో జర్నలిస్ట్గా పని చేసిన ఈయన.. తనకున్న వనరులతో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. అందుకే వింపా ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్స్ అనే స్టార్టప్ ని ప్రారంభించి హైడ్రోపోనిక్ పద్దతిని తెలుసుకుని, దానికి అనుగుణంగా తన ఇంటిలో పై ఉన 3 అంతస్తులను వ్యవసాయ క్షేత్రంగా మలచుకున్నాడు.
ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పద్ధతితో సాగుకు మట్టి అవసరం లేదని, 90 శాతం నీటిని పొదుపు చేయవచ్చు. ఇందులో రసాయనాలు కూడా వాడాల్సిన అవసరం లేదు. కేవలం పీవీసీ పైపుల సహాయంతో అతని బాల్కనీలో పంటలు పండిస్తున్నాడు. స్ట్రా బెర్రీ, కాలీ ఫ్లవర్, బెండకాయలు వంటి 10 వేల రకాల మొక్కలను 3 అంతస్తుల్లో లేయర్స్ గా వేసి పండిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో విషయం ఏమిటంటే ఈ విషయంలో ఇతర రైతులకు కూడా రామ్ వీర్ సహాయం చేస్తున్నాడు.
This man earns 70 lakhs growing vegetables in a 3 storey house without soil or chemicals.#growingvegetables #housegardening #chemicalfree #jounalist #uttarpradesh pic.twitter.com/aZ3N6KFCWN
— The Better India (@thebetterindia) October 20, 2022
చదవండి: క్రెడిట్ స్కోరు పెంచుకోవాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
Comments
Please login to add a commentAdd a comment