న్యూఢిల్లీ: సాప్ట్‌వేర్ ఉత్పత్తుల సంస్థ న్యూజెన్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) బలమైన పనితీరు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 47 శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరింది.
క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.48 కోట్లుగా ఉండడం గమనార్హం. రూ.361 కోట్ల ఆదాయాన్ని సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.293 కోట్లతో పోల్చి చూస్తే 23 శాతం పెరిగింది.
‘‘అన్ని కీలక మార్కెట్లలో మెరుగైన పనితీరు సాధించాం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో బలమైన వృద్ధి నమోదవుతోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కీలక విభాగాలుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్, ప్రభుత్వ విభాగాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది’’అని న్యూజెన్ సాఫ్ట్‌వేర్ సీఈవో వీరేందర్ జీత్ తెలిపారు. కంపెనీ ఉద్యోగుల సంఖ్య 4,400కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment