చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 250 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 165 కోట్లతో పోలిస్తే సుమారు 52 శాతం వృద్ధి సాధించింది. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 21 శాతం పెరిగి రూ. 680 కోట్ల నుంచి రూ. 821 కోట్లకు చేరింది.
నికర వడ్డీ మార్జిన్ 3.74 శాతం నుంచి 4.07 శాతానికి పెరిగింది. నికర మొండి బాకీలు (ఎన్‌పీఏ) 2.99 శాతం నుంచి 1.36 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంకు ఎండీ బి. రమేష్ బాబు తెలిపారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వ్యాపార పరిమాణం దాదాపు 14 శాతం పెరిగి రూ. 1,35,460 కోట్లకు చేరినట్లు వివరించారు. దశాబ్ద కాలంలో వ్యాపారం రెట్టింపైనట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment