న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ సెప్టెంబర్ క్వార్టర్‌కు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రూ.199 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.83 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఆదాయం దాదాపు రెట్టింపై రూ.8,266 కోట్లుగా నమోదైంది.
అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,458 కోట్లుగా ఉంది. దేశీ మార్కెట్లో మధ్య, భారీ స్థాయి వాణిజ్య విక్రయాలు 25,475 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలం వీటి విక్రయాలు 11,988 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ వాటా 9.6 శాతంగా ఉంది. స్వల్ప స్థాయి వాణిజ్య వాహనాల విక్రయాలు 28 శాతం పెరిగి 17,040 యూనిట్లుగా ఉన్నా యి. ఎగుమతులు 25 శాతం పెరిగి 2,780 యూనిట్లుగా నమోదయ్యాయి.
‘‘అంతర్జాతీయంగా మాంద్యం ధోరణలు ఉన్నా, దేశీ వాణిజ్య వాహన మార్కెట్లో వృద్ధి చక్కగా ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మంచి విక్రయాలు పరిశ్రమ వ్యాప్తంగా నమోదయ్యాయి’’అని అశోక్‌లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. మెరుగైన ఉత్పత్తులు, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత భవిష్యత్తు ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment