ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసీ పైపుల తయారీ కంపెనీ అపోలో పైప్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో పంప్ సెట్ల దిగ్గజం కేఎస్బీ లిమిటెడ్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
అపోలో పైప్స్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో అపోలో పైప్స్ నికర లాభం 64 శాతం ఎగసి రూ. 9.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 28 శాతం పుంజుకుని రూ. 123 కోట్లను అధిగమించింది. అమ్మకాల పరిమాణం 19 శాతం పెరిగి 12,268 టన్నులను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.55 శాతం మెరుగుపడి 14.19 శాతానికి చేరాయి. పీవీసీ, హెచ్డీపీఈ పైపులకు పెరిగిన డిమాండ్ కారణంగా పటిష్ట పనితీరును సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో అపోలో పైప్స్ షేరు ప్రస్తుతం 14 శాతం దూసుకెళ్లి రూ. 595 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 598ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వారం రోజుల్లో 29 శాతం ర్యాలీ చేసింది.
కేఎస్బీ లిమిటెడ్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేఎస్బీ లిమిటెడ్ నికర లాభం రూ. 26 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు ఎగసింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాదిపదికన మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో కేఎస్బీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10.4 శాతం జంప్‌చేసి రూ. 509 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 శాతం దూసుకెళ్లి రూ. 540కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment